హైదరాబాద్‌లో గర్భిణి ఆత్మహత్య

అనుమానాస్పద రీతిలో ఓ గర్భిణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌ నగర పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 22 Oct 2020 15:13 IST

జగద్గిరిగుట్ట‌: అనుమానాస్పద రీతిలో ఓ గర్భిణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌ నగర పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన లీల కుమార్తె కృష్ణప్రియ(24) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండేది. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు చెందిన శ్రవణ్‌కుమార్‌ జిమ్‌ నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ దూరపు బంధువులు కావడంతో కొన్నేళ్లు ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తితో కృష్ణప్రియకు వివాహం కాగా అతనితో విడాకులు తీసుకుంది. అనంతరం శ్రవణ్‌కుమార్‌తో ఆమెకు వివాహం కాగా, ప్రస్తుతం కృష్ణప్రియ ఐదు నెలల గర్భిణి. 

ఈ క్రమంలో బుధవారం రాత్రి కృష్ణప్రియ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. శ్రవణ్‌కుమార్‌, అతని కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి లీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని