కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. పితోర్‌గఢ్‌ జిల్లాలోని తంగా గ్రామంలో వర్షాలకు కొండ చరియలు.....

Published : 23 Jul 2020 02:11 IST

పితోర్‌గఢ్‌: ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. పితోర్‌గఢ్‌ జిల్లాలోని తంగా గ్రామంలో వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది గల్లంతైనట్టు గుర్తించారు. వారి ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు మృతదేహాలను బయటకుతీసినట్టు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు. పితోర్‌గఢ్‌, అస్కోట్‌, అల్మోరా ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సైతం గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. డాగ్‌ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దించి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని