షాకింగ్‌ వీడియో: మృతదేహంపై శునకం దాడి

ఓ వీధి కుక్క ప్రభుత్వాస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని తినేందుకు ప్రయత్నించిన భయంకర ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Updated : 28 Nov 2020 06:16 IST

సంభాల్‌: ఓ వీధి కుక్క ప్రభుత్వాస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని తినేందుకు ప్రయత్నించిన ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి సంభాల్‌ జిల్లాలో గురువారం సంభవించిన ఈ సంఘటనపై.. ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.

రోడ్డు ప్రమాదానికి గురైన ఓ చిన్నారిని ఇక్కడి ప్రభుత్వాస్పత్రికి  తీసుకువచ్చారు. అయితే ఆ బాలిక చికిత్స పొందుతూ మరణించింది. తెల్లని గుడ్డలో చుట్టి ఉన్న ఆ మృతదేహాన్ని ఆస్పత్రిలో ఓ మూల స్ట్రెచర్‌పై ఉంచారు. కాగా, దానిని ఓ కుక్క పీక్కు తినడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. 20 సెకన్ల పాటు సాగే ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. చిన్నారి కుటుంబానికి సంతాపం తెలియచేస్తూ.. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పట్ల మృతురాలి కుటుంబీకులు నిరసన వ్యక్తం చేశారు. ఆ రోజు అనేక మరణాలు సంభవించటంతో.. సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. అంతేకాకుండా ఆ పరిసరాల్లో వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరిని సస్పెండ్‌ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని