ఇడుక్కి ఘటన: మరో 6మృతదేహాలు వెలికితీత 

కేరళలోని ఇడుక్కిలో ఇటీవల కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మరో ఆరు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 49కి పెరిగింది......

Published : 11 Aug 2020 02:18 IST

తిరువనంతపురం: కేరళలోని ఇడుక్కిలో ఇటీవల కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మరో ఆరు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 49కి పెరిగింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  కేరళలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. కాసర్‌గోడ్‌, కన్నూర్‌, వయనాడ్‌, కొలికోడ్‌, మళప్పురం, అళప్పుళ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మంగళవారం భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది. రాజమలై సమీపంలోని పెట్టైముడిలో శుక్రవారం రోజు భారీ కొండచరియలు విరిగిపడగా.. తమిళనాడుకు చెందిన తేయాకు కార్మికులు వాటికింద చిక్కుకున్న ఘటన పెను విషాదం నింపిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని