రైతుబీమా సొమ్ముకోసం తండ్రినే చంపేశాడు!

రైతు బీమాకు ఆశపడి కన్నతండ్రినే ఓ వ్యక్తి బండరాయితో కొట్టి చంపాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలోని సంగెం కుర్దు గ్రామంలో...

Published : 24 Nov 2020 01:28 IST

వికారాబాద్‌ జిల్లాలో ఘటన 

యాలాల: రైతు బీమాకు ఆశపడి కన్నతండ్రినే ఓ వ్యక్తి బండరాయితో కొట్టి చంపాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలోని సంగెం కుర్దు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చింతల రుస్తుంకు సంగీత(17), సురేశ్‌(19), శేఖర్‌ (25) సంతానం. రుస్తుంకు మూడెకరాల పొలం ఉండగా ఇద్దరు కుమారులకు ఒక్కో ఎకరా పట్టా చేసి మిగిలిన ఎకరాను తన పేరు మీద ఉంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం పొలంలో కుటుంబసభ్యులు విందు చేసుకున్నారు. ఈ క్రమంలో  రుస్తుం మద్యం సేవించి రాత్రి అక్కడే నిద్రించాడు. పెద్ద కుమారుడైన శేఖర్‌.. తన తండ్రిని చంపితే రూ. 5లక్షల బీమా వస్తుందని భావించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రిపై బండరాయితో మోదాడు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. శేఖర్‌ వ్యవహార శైలిలో అనుమానం రావడంతో గ్రామస్థులు అతడ్ని పోలీసులకు పట్టించారు. ఈ ఘటనపై యాలాల పోలీసులు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ జలందర్‌ రెడ్డికి సమాచారం అందించారు. మృతుని చిన్న కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని