టీఆర్పీ స్కాం: బార్క్‌ మాజీ సీవోవో అరెస్టు

టీఆర్‌పీ(టీవీ రేటింగ్‌ పాయింట్స్‌) రిగ్గింగ్‌ కుంభకోణం కేసు విచారణలో భాగంగా ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు మరో కీలక వ్యక్తిని అరెస్టు చేశారు. బార్క్‌(బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌) మాజీ సీవోవో రోమిల్‌ రామ్‌గరియాను గురువారం అరెస్టు చేశారు.

Published : 18 Dec 2020 02:12 IST

ముంబయి: టీఆర్‌పీ(టీవీ రేటింగ్‌ పాయింట్స్‌) రిగ్గింగ్‌ కుంభకోణం కేసు విచారణలో భాగంగా ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు మరో కీలక వ్యక్తిని అరెస్టు చేశారు. బార్క్‌(బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌) మాజీ సీవోవో రోమిల్‌ రామ్‌గరియాను గురువారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ముంబయి నేర విభాగం పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో సంబంధాలున్నాయన్న ఆరోపణలతోనే రామ్‌గరియాను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. కాగా ఆయనను త్వరలో స్థానిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నామని పోలీసులు తెలిపారు.

టీఆర్‌పీల విషయంలో కొన్ని ఛానెళ్లు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఇటీవల బార్క్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును విచారణ చేపట్టిన నేర విభాగం ఇప్పటివరకూ 14 మందిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రిపబ్లిక్‌ మీడియా నెట్‌వర్క్‌ సీఈవో వికాస్‌ను కూడా గత ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన బుధవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. 

ఇదీ చదవండి

వ్యవసాయ చట్టాల కాపీలను చింపేసిన కేజ్రీవాల్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు