Suicide: పని ఒత్తిడి తాళలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణం

పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, కోసూరు గ్రామానికి చెందిన జంగం అనిల్‌ కుమార్‌ ...

Updated : 03 Aug 2021 11:01 IST

శేరిలింగంపల్లి: పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, కోసూరు గ్రామానికి చెందిన జంగం అనిల్‌ కుమార్‌ (34). గచ్చిబౌలి టీసీఎస్‌లో కొన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్య జ్యోతి, కుమార్తె జైష్ణ మాలిక నాలుగున్నర సంవత్సరాలుగా చందానగర్‌లోని కైలాష్‌ నగర్‌ ఎన్డీఆర్‌ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. రోజులో అనేకమార్లు కార్యాలయం నుంచి ఫోన్లు చేస్తూ అనేక బాధ్యతలు అప్పగిస్తుండటంతో తీవ్ర మానసిక ఇబ్బంది పడుతున్నాడు. సోమవారం ఉదయం కుమార్తె పాఠశాల అడ్మిషన్‌ కోసం భార్యభర్తలు కలిసి వెళదామని నిర్ణయించుకున్నారు. పాఠశాలకు బయలు దేరుతున్న క్రమంలో కార్యాలయం నుంచి టీం లీడర్‌ సయ్యద్‌ హుస్సేన్‌ ఫోన్‌ చేసి పని అప్పగించాడు. దీంతో స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నేను పాఠశాలకు రాలేను, నువ్వు వెళ్లి పాఠశాలలో మాట్లాడి రావాలని భార్యని కోరాడు. ఆమె కుమార్తెను తీసుకొని వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి అనిల్‌కుమార్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని