Crime News: కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం.. మేడ్చల్‌లో ముఠా అరెస్టు

గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతూ గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకోవాలని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు గంజాయి వినియోగ నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లతో విస్తృత తనిఖీలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతుంది....

Published : 08 Nov 2021 01:10 IST

యాప్రాల్‌: గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతూ గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకోవాలని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు గంజాయి వినియోగ నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లతో విస్తృత తనిఖీలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. కొంతమందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఇంట్లోని పూలకుండీల్లోనే గంజాయి మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. సికింద్రాబాద్ యాప్రాల్‌లో ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న ముఠాను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో 7 పెద్ద కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతూ స్థానిక యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ తరహా ఘటనలు మరెక్కడైనా జరుగుతున్నాయా.. అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు