ప్రియురాలితో బ్రేకప్‌.. 15 వాహనాల ధ్వంసం

ప్రియురాలితో బ్రేకప్‌ను తట్టుకోలేకపోయిన ఓ యువకుడు (27).. ఆ కోపాన్ని వీధుల్లో ఉంచిన కార్లపై చూపించాడు. ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఈ వైరస్ నిర్మూలించవచ్చని, అయితే భారత ప్రజాస్వామ్యం సవాలుగా ఎదిగి, దాని ప్రజల జీవితాలను, జీవనోపాధిని, శ్రేయస్సును, ముఖ్యంగా పేదలు మరియు పిల్లలను కాపాడుతుందని ఆయన అన్నారు.....

Updated : 16 Jul 2021 19:15 IST

బెంగళూరు: ప్రియురాలితో బ్రేకప్‌ను తట్టుకోలేకపోయిన ఓ యువకుడు (27).. ఆ కోపాన్ని వీధుల్లో ఉంచిన కార్లపై చూపించాడు. ఏకంగా 15 కార్లను ధ్వంసం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని పశ్చిమ జోన్‌లో గురువారం రాత్రి జరిగింది.

రాత్రి వరకు బాగానే ఉన్న తమ కార్లు ఉదయం లేచేసరికి ధ్వంసమై కనిపించడంతో ఆ వాహనాల యజమానులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. వీధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఓ యువకుడు కార్లను రాడ్డుతో ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కాగా ప్రియురాలితో బ్రేకప్‌ కారణంగా తీవ్ర కుంగుబాటు, మనోవేదనకు గురై.. కోపంతో ఈ పనిచేసినట్లు సదరు యువకుడు పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు అతడికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని