GHMC: అనిశా వలలో జీహెచ్‌ఎంసీ టీసీ, బీసీ

మ్యుటేషన్‌ చేసేందుకు రూ.5వేలు లంచం తీసుకుంటు ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. హైదరాబాద్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 13 Oct 2021 07:48 IST

సురేష్‌కుమార్‌, రాజేష్‌

ఖైరతాబాద్‌: మ్యుటేషన్‌ చేసేందుకు రూ.5వేలు లంచం తీసుకుంటు ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. హైదరాబాద్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నం (12) సర్కిల్‌లో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా సురేష్‌కుమార్‌, ఇన్‌ఛార్జి బిల్‌ కలెక్టర్‌గా కామాటి పల్లెపాగ రాజేశ్వర్‌ పనిచేస్తున్నారు. సర్కిల్‌ ప్రాంతానికి చెందిన మామిడి జ్ఞానేశ్వర్‌ తన ఇంటికి సంబంధించి మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పని చేసేందుకు ఈనెల 8వ తేదీన వారు రూ.6వేలు లంచం డిమాండ్‌ చేశారు. అనిశా అధికారులు మంగళవారం సాయంత్రం బాధితుడి నుంచి  డబ్బు తీసుకుంటున్న ఉద్యోగులను పట్టుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని