విశాఖ యారాడ తీరంలో విషాదం

విశాఖ నగర పరిధిలోని యారాడ తీరంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు దిగిన ఇద్దరు నేవీ

Published : 08 Nov 2020 19:44 IST

ఇద్దరు నేవీ ఉద్యోగులు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

గాజువాక: విశాఖ నగర పరిధిలోని యారాడ తీరంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు దిగిన ఇద్దరు నేవీ సెయిలర్లు గల్లంతవడం కలకలం రేపింది.  ఆదివారం సెలవు కావడంతో మొత్తం 54 మంది నేవీ సిబ్బంది సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లారు. వీరిలో  మణిపూర్‌కు చెందిన జగత్‌సింగ్‌(28), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శుభమ్‌ సింగ్‌(23)తో పాటు సునీల్‌, వినీత్‌కుమార్‌ సముద్రం ఒడ్డున వాలీబాల్‌ ఆడి అనంతరం ఈతకు దిగారు. కెరటాల ఉద్ధృతికి జగత్‌సింగ్‌, శుభమ్‌ కొట్టుకుపోవడం చూసి మిగతా ఇద్దరు ప్రాణభయంతో ఒడ్డుకు వచ్చేశారు. మిగతా సిబ్బంది దీన్ని గమనించి జగత్‌సింగ్‌, శుభమ్‌ను రక్షించేందుకు యత్నించారు. ఈ క్రమంలో జగత్‌సింగ్‌ను ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారు. గల్లంతైన శుభమ్‌ కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై విశాఖ న్యూ పోర్టు పోలీసులకు నేవీ కమాండెంట్ విజయ్‌ కృష్ణన్‌ ఫిర్యాదు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని