చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేస్తే కఠిన చర్యలు

అంతర్జాలంలో చైల్డ్‌ పోర్నోగ్రఫీ సెర్చ్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ అంతర్జాలంలో ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించారు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్‌ పోర్నోగ్రఫీ నిషేధించినట్లు సైబర్‌ క్రైం పోలీసులు వెల్లడించారు.

Published : 07 Aug 2020 02:54 IST

హైదరాబాద్: అంతర్జాలంలో చైల్డ్‌ పోర్నోగ్రఫీ సెర్చ్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ అంతర్జాలంలో ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించారు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్‌ పోర్నోగ్రఫీ నిషేధించినట్లు సైబర్‌ క్రైం పోలీసులు వెల్లడించారు. ఇంటర్నెట్‌లో ఎవరు సెర్చ్‌ చేసినా, ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసినా నేషనల్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)లో నమోదవుతుందన్నారు. తెలంగాణకు చెందిన 15 మంది వివరాలను ఎన్‌సీఆర్‌బీ అధికారులు సీఐడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరిని తాజాగా అరెస్టు చేసినట్లు చెప్పారు. తార్నాకకు చెందిన మహమ్మద్‌ ఫిరోజ్‌, కాచిగూడకు చెందిన ప్రశాంత్‌ కుమార్‌ 2019లో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేశారన్నారు. మరో 13 మంది వివరాలను ఆయా జిల్లాల పోలీసులకు సీఐడీ పోలీసులు పంపారు. నిషేధిత చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని