Updated : 06 Oct 2020 04:34 IST

హాథ్రస్‌ ఘటన.. 19 మందిపై కేసులు!

లఖ్‌నవూ: హాథ్రస్‌ అత్యాచార ఘటనకు సంబంధించి 19 మంది గుర్తు తెలియని వ్యక్తులపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనను తప్పుదోవ పట్టించేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఈ కేసులు నమోదు చేశారు. దేశ ద్రోహం, కుట్ర కోణం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి.

తమ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేయడం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక్కడి చందా పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసులు నమోదు చేశారు. హాథ్రస్‌ కేసు విషయంలో యూపీ ప్రభుత్వ ప్రకటనలను మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్న వారిపై ఈ కేసులు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఐపీసీతో పాటు ఐటీ చట్టాల కింద ఈ కేసులు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని