
భార్యపై అనుమానం.. భర్త కిరాతకం
లఖ్‌నవూ: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఆ రాష్ట్రంలోని బందా జిల్లాలో కిన్నర్ యాదవ్, విమ్లా దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన యాదవ్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి అతని భార్య పక్కింట్లో ఉండే ఎలక్ట్రీషియన్ రవికాంత్‌తో మాట్లాడుతుండగా చూశాడు. దీంతో భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఘర్షణ పెద్దదై విచక్షణ కోల్పోయిన యాదవ్ ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. విమ్లా తల నరికేశారు. రవికాంత్‌ను సైతం గాయపరిచాడు.
అనంతరం యాదవ్ భార్య తలతో పోలీసులకు వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య తరచూ ఇంటి పక్కన ఉండే రవికాంత్‌తో మాట్లాడుతుండేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. తన భార్యకు ఆ ఎలక్ట్రీషియన్‌తో వివాహేతర సంబంధం ఉందని యాదవ్ వారికిచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. ఆ కారణంతోనే భార్యను హత్య చేసినట్లు పోలీసులకు వివరించాడు. భార్యను హత్య చేసిన యాదవ్ ఆమె తలతో 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లిన యాదవ్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.