మహిళపై దాడిచేసి.. కారులో నుంచి తోసేసి..

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది..

Published : 08 Sep 2020 01:15 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళపై దాడిచేసి ఆమెను నడిచే కారులోనుంచి తోసేశాడు. సదరు బాధితురాలికి సహాయమందించేందుకు ప్రయత్నించిన మరో మహిళను కారుతో ఢీకొట్టి పారిపోయాడు. కోల్‌కతా పోలీసుల వివరాల ప్రకారం.. కాలికాపుర్‌ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల మహిళకు కొద్దిరోజుల క్రితం అమితాబ బోస్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈనెల 5వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మహిళను కారులో తీసుకెళ్లిన బోస్‌ నగరంలో కొద్దిసేపు తిప్పాడు. అనంతరం తనని ఫ్లాట్ వద్ద దిగబెట్టాలని మహిళ కోరగా ఆమెను ఫ్లాట్ వద్దకు తీసుకొచ్చాడు కానీ దింపేందుకు ఇష్టపడలేదు. కారు ఆపకుండా బోస్‌ ఒక్కసారిగా మహిళపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కారులోనుంచి రోడ్డు మీద తోసేశాడు. బాధితురాలి రోదన విన్న దంపతులు దీప్‌ సత్పతి, అతడి భార్య నిలంజనా చటర్జీ వారి కారులో నుంచి దిగి ఆమెకు సాయమందించేందుకు ప్రయత్నించారు. కాగా కారును వేగంగా నడిపిన నిందితుడు నిలంజనా చటర్జీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆమె కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని