కుమారుడిని తప్పించేందుకు పోలీసుల కళ్లల్లో కారం

నిందితుడైన కుమారుడిని అరెస్టు నుంచి తప్పించేందుకు ఓ తల్లి పోలీసుల కళ్లల్లో కారం చల్లింది. ఇద్దరు పోలీసుల కళ్లల్లో కారం కొట్టి కుమారుడు పారిపోయేందుకు సహకరించింది...

Updated : 09 Nov 2020 11:33 IST

ముంబయి: నిందితుడైన కుమారుడిని అరెస్టు నుంచి తప్పించేందుకు ఓ తల్లి పోలీసుల కళ్లల్లో కారం చల్లింది. కుమారుడు పారిపోయేందుకు సహకరించింది. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబుజ్వాడి ప్రాంతంలో నివాసముంటున్న ఓ వ్యక్తి పలు కేసుల్లో నిందితుడు. అరెస్టు చేసేందుకు ఇద్దరు పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నారు. తన కుమారుడిని అరెస్టు చేసేందుకు వచ్చారని తెలుసుకున్న నిందితుడి తల్లి ఆ ఇద్దరి కళ్లల్లో కారంపొడి చల్లింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం సదరు తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాల్వానీ ప్రాంతంలో ఉన్న నిందితుడిని కూడా అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని