ఆ ప్రకటనకు మద్దతు.. మహిళకు బెదిరింపులు

ఓ ప్రముఖ బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రకటనపై వివాదం నెలకొన్న విషయం విదితమే. ఈ ప్రకటనపై సామాజిక

Published : 18 Oct 2020 02:54 IST

పుణె: ఓ ప్రముఖ బంగారు ఆభరణాల వ్యాపార సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రకటనపై వివాదం నెలకొన్న విషయం విదితమే. ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. లవ్‌జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ దేశంలో పలు చోట్ల ఈ ప్రకటనకు సంబంధించి వివాదం తలెత్తింది.

దీనిపై స్పందించిన సదరు సంస్థ మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణలు చెప్పి ఆ ప్రకటనను తొలగించిన విషయం తెలిసింది. అయితే మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ మహిళ తాను మరో వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పి..  తన పెళ్లి ఫొటోలను జత చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆ ప్రకటనకు మద్దతు తెలిపారు. సమాజంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఆభరణాల సంస్థ విడుదల చేసిన ప్రకటనకు మద్దతు తెలిపినందుకు తనకు వేల సంఖ్యలో బెదిరింపు సందేశాలు వస్తున్నట్లు సదరు మహిళ వాపోయారు. తన ఫోన్‌ నెంబరు, చిరునామాను బహిర్గత చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

తన పెళ్లి ఫొటోలపై ట్విటర్‌ వేదికగా అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తూ 40 వేల సందేశాలు రావటంతో పుణె సైబర్‌ సెల్‌ పోలీసులను ఆశ్రయించినట్లు ఆ మహిళ వివరించారు. స్థానికంగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ మహిళ పుణెలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ మహిళ, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, ఇతర కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు మహిళకు అండగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని