Jaggayyapeta: అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో పేలిన బాయిలర్‌.. 20 మందికి గాయాలు

ఎన్టీఆర్‌ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది.

Updated : 07 Jul 2024 15:06 IST

జగ్గయ్యపేట: ఎన్టీఆర్‌ జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలి 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బిహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. జగ్గయ్యపేట, విజయవాడ ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. 

ఘటనపై స్పందించిన మంత్రి సుభాష్‌

సిమెంట్‌ పరిశ్రమలో పేలుడు ఘటనపై కార్మికశాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ స్పందించారు. ప్రీ హీటర్‌ లోపంతోనే పేలుడు జరిగినట్లు తెలిసిందని చెప్పారు. దాన్ని జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందన్నారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని