Vijayawada: విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్‌.. ఐదుగురిపై కేసు నమోదు

విజయవాడలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిపై కేసు నమోదైంది.

Updated : 10 Jul 2024 15:50 IST

గుంటూరు: విజయవాడలో కిడ్నీ రాకెట్‌ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిపై కేసు నమోదైంది. రూ.30 లక్షలు ఇస్తామని నమ్మించి తన కిడ్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసగించారని గుంటూరుకు చెందిన బాధితుడు గార్లపాటి మధుబాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఎస్పీ తుషార్‌ దూడీ ప్రత్యేక దర్యాప్తునకు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని హోం మంత్రి అనిత కూడా ఆదేశాలిచ్చారు. 

దీంతో ఈ కేసును పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా అతన్ని మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయడం, అందుకు నకిలీ పత్రాలు సృష్టించడం తదితర నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద నగరంపాలెం పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో బాషా, వెంకట్‌, సుబ్రహ్మణ్యం పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. డాక్టర్‌ శరత్‌బాబుతో పాటు కిడ్నీ స్వీకర్త వెంకటస్వామిపైనా కేసు నమోదు చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లావాదేవీల్లో తేడా రావటంతోనే కిడ్నీ రాకెట్‌ వ్యవహారం వెలుగు చూసింది. కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని