Crime News: రైలు ఇంజిన్‌కు చిక్కుకున్న మృతదేహం.. జమ్మికుంట స్టేషన్‌లో కలకలం

అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌కు మృతదేహం చిక్కుకుని రావడం కలకలం రేపింది.ఈ ఘటనతో రైలు గంటన్నర పాటు జమ్మికుంట స్టేషన్‌లోనే నిలిచిపోయింది.

Updated : 26 Jan 2023 23:11 IST

కరీంనగర్‌: చెన్నై - జమ్ము వెళ్తున్న అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌కు మృతదేహం చిక్కుకుని ఉండడం కలకలం రేపింది. రైలు జమ్మికుంట స్టేషన్‌కి రాగానే ఇంజిన్‌కు చిక్కుకున్న మృతదేహాన్ని లోకో పైలెట్‌ గుర్తించి రైలును ఆపారు. మృతుడు హనుమకొండ నయీంనగర్‌కు చెందిన వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ విశ్రాంత ఉద్యోగి ఉప్పలయ్య(72)గా గుర్తించారు. మృతుడి జేబులో సూసైడ్‌ లేఖ లభ్యమైంది. తన చావుకు తానే కారణమని లేఖలో రాసి ఉందని అధికారులు వెల్లడించారు. కొంత కాలంగా ఉప్పలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటన్నర పాటు జమ్మికుంట స్టేషన్‌లోనే నిలిచిపోయింది. మృతదేహాన్ని ఇంజిన్‌ నుంచి వేరు చేసిన తర్వాత అధికారులు రైలును పంపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు