Cyber crime: సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌కార్డులు చేరవేస్తున్న ముఠా అరెస్టు

సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated : 19 Jun 2024 21:28 IST

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 113 సిమ్‌ కార్డులు, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి పేర్లతో సిమ్‌ కార్డులు తీసుకుని ఈ ముఠా దుబాయ్‌కి పంపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ నేరాల్లో భాగస్వాములైనట్టు పోలీసులు గుర్తించారు. దుబాయ్‌లో ఉన్న వ్యక్తులు భారత్‌లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. 

విజయ్‌ ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన అతను చైనాకు చెందిన సైబర్‌ నేరగాళ్ల కోసం దుబాయిలో కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. వివిధ మార్గాల్లో సేకరించిన సిమ్ కార్డులు దుబాయ్, థాయిలాండ్‌తోపాటు కాంబోడియాలో కూడా వినియోగిస్తున్నట్లు సైబర్ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. నిందితులు నకిలీ సిమ్ కార్డులతో వాట్సప్‌ ఖాతాలు తెరిచి, కాల్ సెంటర్ల ద్వారా ఫోన్లు చేస్తూ భారతీయులకు ఎరవేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు కీలక సైబర్ నేరాల్లో ఈ వాట్సప్‌ నంబర్లను వినియోగించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని