రోడ్డు పక్కన నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లిన ఘటన హరియాణాలోని ఝాజ్జర్‌ జిల్లాలో చోటుచేసుకొంది. గురువారం తెల్లవారు జామున కుండలీ-మనేసర్‌- పాల్వాల్‌ హైవేపై చోటుచేసుకున్నమనేసర్‌ పవార్‌ హైవేపై చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Updated : 19 May 2022 12:00 IST

ముగ్గురు మృతి...11మందికి తీవ్ర గాయాలు

చండీగఢ్‌: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లిన ఘటన హరియాణాలోని ఝాజ్జర్‌ జిల్లాలో చోటుచేసుకొంది. గురువారం తెల్లవారు జామున కుండలీ-మనేసర్‌- పాల్వాల్‌ హైవేపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..  అశోద టోల్‌ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 18 మంది కూలీలు పని చేస్తున్నారు. వారిలో 14 మంది పని అనంతరం విరామం కోసం సమీపంలోని ఫుట్‌పాత్‌పై సేదతీరారు.

అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఓ లారీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్‌ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు పీజీఐఎమ్‌ఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్‌ మద్యం తాగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి అమిత్‌ యశ్‌వర్థన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని