Andhra News: సెక్యూరిటీ గార్డ్‌లు, స్వీపర్ల వైద్యం.. వ్యక్తి మృతి!

నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి సెక్యూరిటీ గార్డ్‌లు, స్వీపర్లు వైద్యం చేయడం..

Updated : 12 May 2022 06:31 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి సెక్యూరిటీ గార్డ్‌లు, స్వీపర్లు వైద్యం చేయడం.. తర్వాత ఆ వ్యక్తి మృతిచెందడం తీవ్ర వివాదాస్పదమైంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణ, చిరంజీవి అనే వ్యక్తులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు లేకపోవడం, డ్యూటీ డాక్టర్‌ సరిగ్గా స్పందించకపోవడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్‌లు, స్వీపర్లు వైద్యం అందించారు. తలకు కట్లు కట్టడం, సెలైన్లు పెట్టడం చేశారు. అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్‌ కేవలం ఇంజెక్షన్‌ చేసి సరిపెట్టుకున్నారు.

రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించారు. అంబులెన్స్‌లో ఎక్కించే క్రమంలో ఆయన తలకు సెక్యూరిటీ గార్డు కట్టిన కట్టు ఊడిపోయింది. నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణ మృతిచెందారు. ఆత్మకూరు ఆస్పత్రిలో సరైన ప్రాథమిక వైద్యం అందకనే రామకృష్ణ చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు