
Suicide: కరోనా భయంతో భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా భయంతో ఓ యువకుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి(30) కుటుంబ కలహాలతో నిన్న రాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో అతడికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనా భయంతో అతను ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని అద్దం పగులగొట్టి కిందకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరోనా భయంతోనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.