
Published : 27 Jul 2020 01:29 IST
కరోనా భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం
జగిత్యాల: హోం క్వారంటైన్లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కోనాపూర్కి చెందిన ఓ యువకుడు ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్నాడు. అయితే కరోనా భయం, కుటుంబ సమస్యలతో సతమతమై నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన యువకుడిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.