Alcohol: పోలీస్‌స్టేషన్‌లో మద్యం తాగుతూ.. ఫొటోకి పోజు..!

మద్యం సీసాతో ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోకి  ప్రవేశించాడు ఓ వ్యక్తి. అంతేకాకుండా అధికారి కుర్చీలో కూర్చొని మద్యం గ్లాసులో కలుపుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు.

Updated : 12 May 2023 14:30 IST

లఖ్‌నవూ: ఏకంగా పోలీస్‌స్టేషన్‌ (Police station)లోనే మద్యం (Alcohol) తాగాడు ఓ ఘనుడు. అధికారులు లేని సమయంలో స్టేషన్‌ ఇన్‌ఛార్జి కుర్చీలో దర్జాగా కూర్చొని ఫొటో తీసుకొన్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttarpradesh)లోని సహరన్‌పూర్‌ పట్టణం ఖతాఖేరీ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇమ్రాన్‌ అనే వ్యక్తి ఓ పండుగ సందర్భంగా అధికారులు గస్తీలో ఉన్న సమయంలో ఖతాఖేరీ పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడ్డాడు. తనతో పాటు మద్యం సీసాను కూడా వెంట తెచ్చుకున్నాడు. స్టేషన్‌ ఇన్‌ఛార్జి గదిలోకి వెళ్లి అంతా సిద్ధం చేసుకుని గ్లాసులోకి మద్యం పోస్తూ ఫొటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. వెంటనే సేష్టన్‌ ఇన్‌ఛార్జిని పిలిచి వివరాలు అడగగా అతడు నోరు మెదపలేదు. తక్షణమే ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నిందుతుడ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఎస్‌పీ విపన్‌ తడ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు