Crime News: పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

Updated : 14 Jun 2024 13:56 IST

పెద్దపల్లి: ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. బాలికపై ఓ రైస్‌మిల్లు డ్రైవర్‌ బలరామ్‌ గురువారం రాత్రి అత్యాచారం చేసి హత్య చేశాడు. మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అర్ధరాత్రి బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులు పరిసరాల్లో వెతికారు. అనంతరం నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని