Updated : 23 Jun 2022 15:24 IST

నాలుగో అంతస్తు పైనుంచి పడి.. ఐటీ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌: నగరంలోని మియాపూర్‌ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మియాపూర్‌ దీప్తి శ్రీనగర్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సందీప్‌(22) గురువారం ఇంటి నాలుగో అంతస్తు పైనుంచి ల్యాప్‌టాప్‌తో సహా కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శవపరీక్ష నిమిత్తం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts