Hyderabad: ఉదయమే హాస్టల్‌లో చేరిక.. అంతలోనే మహిళా టెకీ ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకుంది.

Updated : 20 Nov 2023 22:15 IST

రాయదుర్గం: హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం మధురానగర్‌లోని ఓ వసతి గృహంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని వీణ(24)గా పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయమే వీణ వసతి గృహంలో చేరినట్లు తెలిపారు. వీణ స్వస్థలం షాద్‌నగర్‌ శ్రీరామ్‌నగర్‌ కాలనీగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీణ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని