Road accident: అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని తారామతిపేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. చర్లపల్లి నుంచి కోదాడకు వెళ్తుండగా ట్యాంకర్‌ అదుపు

Updated : 06 Jul 2022 15:07 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని తారామతిపేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. చర్లపల్లి నుంచి కోదాడకు వెళ్తుండగా ట్యాంకర్‌ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్యాంకర్‌ను రహదారిపై నుంచి తొలగించారు. రహదారిపై ట్యాంకర్‌ బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని