Crime News: స్క్రూడ్రైవర్‌తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య

స్క్రూడ్రైవర్‌తో మెడపై పొడిచి భర్తను భార్య అంతమొందించిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చిన్న తుమ్మడిలో చోటు చేసుకుంది.

Updated : 03 Jul 2024 11:15 IST

బంటుమిల్లి: క్షణికావేశంలో భర్తను భార్య చంపేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. బంటుమిల్లి మండలం చిన్న తుమ్మడికి చెందిన జి.అప్పారావు (30) మద్యం మత్తులో భార్య కీర్తనతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కీర్తన.. స్క్రూడ్రైవర్‌తో అప్పారావు మెడపై పొడిచింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. బంటుమిల్లి ఎస్సై జి.వాసు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని