viral video: కదులుతున్న రైలు నుంచి కిందకు పడిన మహిళ... రక్షించిన పోలీసు

ముంబయి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి మహిళ అదుపు తప్పి కిందకు పడిపోయారు. అప్రమత్తమైన హోంగార్టు వేంటనే ఆమెను రైలు కింద పడకుండా కాపాడారు.

Updated : 26 Apr 2022 04:57 IST

ముంబయి: కదులుతున్న రైలులో నుంచి ఒక మహిళ కిందకు పడిపోవడంతో అక్కడే ఉన్న హోంగార్డు  ఆమెను రక్షించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబయిలోని జోగిశ్వరి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన  వీడియో  ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.  కదులుతున్న రైలు ఎక్కిన మహిళ బోగీ హ్యండల్‌ పట్టుకుని బ్యాలెన్స్‌ చేసుకోడానికి ప్రయత్నించారు.  అయితే కాలు జారిపోవడంతో రైలుకు ప్లాట్‌ ఫారంకు మధ్య పడిపోయారు.  అక్కడే ఉన్న హోంగార్డు  అల్తాఫ్‌ ఆమెను రక్షించారు. సకాలంలో పోలీసు చేసిన సాయాన్ని అక్కడి వారు ప్రశంసించారు. పోలీసుకు రివార్డు ఇవ్వనున్నట్టు పోలీసు కమిషనర్‌ ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని