Hyd News: ప్రియుడితో రాసలీలలు.. అడ్డంగా దొరికేసిన జవాన్‌ భార్య

 ప్రియుడితో ఓ జవాన్‌ భార్య రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన నగరంలోని రహమత్‌నగర్‌.. 

Updated : 19 May 2022 17:42 IST

హైదరాబాద్‌: ప్రియుడితో ఓ జవాన్‌ భార్య రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన నగరంలోని రహమత్‌నగర్‌ పరిధిలో చోటు చేసుకుంది. రహమత్‌నగర్‌ పరిధిలో ఉంటున్న జవాన్‌ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ప్రియుడినే భర్తగా పరిచయం చేసిన కి‘లేడీ’.. ఇల్లు అద్దెకు తీసుకుంది. అకస్మాత్తుగా ఇంటికొచ్చిన జవాన్‌.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్యను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వాళ్లను ఇంట్లోనే ఉంచి తాళం వేసిన జవాన్‌.. భార్య, ఆమె ప్రియుడిపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జవాన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. జవాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని