Shraddha Walkar: శ్రద్ధావాకర్ హత్య కేసులో కీలక ఆడియోక్లిప్ వెలుగులోకి..!
శ్రద్ధా వాకర్(Shraddha Walkar) హత్య కేసులో కీలక సాక్ష్యం పోలీసుల చేతికి లభించింది. శ్రద్ధా-ఆఫ్తాబ్ గొడవపడుతున్న ఆడియోక్లిప్ వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్(Shraddha Walkar) హత్య కేసులో కీలకమైన ఆడియో క్లిప్ దిల్లీ పోలీసుల చేతికి చిక్కింది. దీనిలో శ్రద్ధా వాకర్, ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా(Aaftab Poonawala) మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన గొడవ రికార్డైంది. దీంతో శ్రద్ధా(Shraddha Walkar)ను అతడు ఎలా వేధించాడో పోలీసులు నిరూపించేందుకు ఈ కేసులో ఆడియోక్లిప్ కీలక సాక్ష్యంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆఫ్తాబ్ (Aaftab Poonawala)ఆడియో నమూనాలను కూడా పోలీసులు సేకరించనున్నారు. దీంతోపాటు ఆఫ్తాబ్-శ్రద్ధాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను కూడా స్వాధీనం చేసుకొన్నారు. దీనిలో నిందితుడు ఆఫ్తాబ్(Aaftab Poonawala)కు కౌన్సిలింగ్ సెషన్ నిర్వహిస్తున్న దృశ్యాలున్నాయి. దీనిని కూడా నిర్ధారించుకోవడానికి ఆఫ్తాబ్(Aaftab Poonawala)కు ఫేస్‌రికగ్నైజేషన్ టెస్ట్ నిర్వహించనున్నారు.
శుక్రవారం ఆఫ్తాబ్(Aaftab Poonawala) జ్యూడిషియల్ కస్టడీని దిల్లీ న్యాయస్థానం జనవరి 6 వరకు పొడిగించింది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ వాపస్ తీసుకోవడంతో కోర్టు కూడా దానిని కొట్టివేసింది. మరోపక్క ఆఫ్తాబ్ ఇంటి నుంచి సేకరించిన రక్త నమూనాలు, పోలీసులు సేకరించిన ఎముకల డీఎన్‌ఏ శ్రద్ధా(Shraddha Walkar) కుటుంబ సభ్యుల నమూనాలతో మ్యాచ్ అయ్యాయి. దీనికి తోడు శుక్రవారం పాలిగ్రాఫ్ టెస్ట్ పరీక్షల నివేదికలు కూడా శుక్రవారం పోలీసుల చేతికి వచ్చాయి. తన సహజీవన భాగస్వామి అయిన శ్రద్ధా వాకర్‌ను చంపి, ఆమె శరీరాన్ని అతి దారుణంగా ముక్కలు చేసిన ఆఫ్తాబ్(Aaftab Poonawala)ను దిల్లీ పోలీసులు గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/23)