Bribe: రూ.2.25 లక్షల లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన అధికారి

ఆదిలాబాద్‌ల్‌లో ఓ అధికారి లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Updated : 31 Jan 2023 15:56 IST

ఆదిలాబాద్‌ క్రైం: ఆదిలాబాద్‌ జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్‌ కుమార్‌ ఓ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి రూ. 2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా అనిశా (ACB) డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలోని అధికారుల బృందం పట్టుకున్నారు. ఆయనతోపాటు సహాయ ఉపాధి కల్పనాధికారి విజయలక్ష్మి, రిమ్స్‌ జూనియర్‌ అసిస్టెంట్లు తేజను అదుపులోకి తీసుకున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వడానికి అధికారులు లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని