Telangana News: సంగారెడ్డి ఎంపీవోపై ఏసీబీ కేసు.. అక్రమాస్తులెంతో తెలుసా?

సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్‌రెడ్డిపై ఆదాయానికి మించి

Updated : 12 May 2022 15:00 IST

హైదరాబాద్‌: సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్‌రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. సురేందర్‌రెడ్డి ఇంట్లో రూ.2.31కోట్ల విలువైన ఆక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. రూ.43.79 లక్షల విలువ చేసే నాలుగు ఓపెన్‌ ప్లాట్ల దస్త్రాలు, రూ.8.11లక్షల విలువైన వ్యవసాయ భూముల పత్రాలు, 190 తులాల బంగారం, రూ.4.22 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలను ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. ఎంపీవోకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తమకు సమాచారం వచ్చిందని.. హైదరాబాద్‌ అల్వాల్‌లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి రూ.2.31కోట్ల ఆస్తులు గుర్తించామన్నారు. మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ.20కోట్ల నుంచి రూ.30 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సంగారెడ్డిలో పనిచేస్తున్న సురేందర్‌రెడ్డి.. గతంలో శంషాబాద్‌లో పనిచేసినపుడు భారీగా ఆస్తులు కూడబెట్టారని డీఎస్పీ చెప్పారు. ఎస్‌బీఐ బ్యాంకు లాకర్లలో బంగారం, సురేందర్‌రెడ్డి బావమరిది బినామీలుగా రెండు స్థిరాస్తులను గుర్తించినట్లు ఆయన వివరించారు. సురేందర్‌రెడ్డిని బుధవారమే అరెస్ట్‌ చేశామని.. వైద్య పరీక్షల అనంతరం నేడు కోర్టులో హాజరుపరచనున్నామని తెలిపారు. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి సస్పెన్షన్‌లో ఉన్నారని డీఎస్పీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు