Crime news: రూ.5.50లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌

రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ ఓ వ్యక్తిని రూ.5.50లక్షలు

Updated : 08 Sep 2022 17:10 IST

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ ఓ వ్యక్తిని రూ.5.50లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని డాక్యుమెంట్‌ రైటర్‌ వాసు ద్వారా   తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని