Published : 14 May 2021 09:52 IST

లారీ బీభత్సం: ఇద్దరు పోలీసుల మృతి

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఈ వేకువజామున వంతెన వద్ద గస్తీలో ఉన్న కానిస్టేబుల్‌, హోంగార్డుపై దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. విజయవాడ నుంచి వస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్టుగా వెళ్లేందుకు హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ, హోంగార్డు ఎన్‌.ఎస్‌.రెడ్డి ఉండూరు వంతెన వద్ద వాహనంతో వేచి చూస్తుండగా అతివేగంతో వచ్చిన లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం కూడా దెబ్బతింది.  

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని