Published : 06 Aug 2020 18:50 IST

పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

ఉరవకొండ (అనంతపురం): అందరూ పెళ్లి వేడుకకు వెళ్లి ఆనందంగా తిరుగు పయనమయ్యారు. కానీ, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరామపేటలోని వధువు ఇంట్లో గురువారం మధ్యాహ్నం పెళ్లి జరిగింది. వరుడు గ్రామమైన మరూట్ల తండా నుంచి పెళ్లి కొచ్చిన బంధువులు సాయంత్రం ట్రాక్టర్‌లో స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో శివరామపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముబీనా (20) మృతి చెందింది. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కూడేరు పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని