Agra: చిలుక వాంగ్మూలంతో హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు!
ఆగ్రా(Agra)కు చెందిన విజయ్ శర్మ భార్య నీలమ్ శర్మ 2014 ఫిబ్రవరి 20న ఇంట్లో హత్యకు గురైంది. ఈ కేసు విచారణలో ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.
ఆగ్రా: తొమ్మిదేళ్ల క్రితం నాటి హత్య కేసులో ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితురాలిని పోలీసులు విచారించారు. ఆ కేసులో పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కోర్టు ఆమెను దోషిగా నిర్థారించి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. పోలీసు విచారణలో సాక్షులు వాంగ్మూలం ఇవ్వడం సాధారణ విషయమే కదా..! ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన సాక్షి.. ఓ చిలుక (Parrot) కావడం విశేషం. అదేంటీ.. జంతువులు, పక్షుల సాక్ష్యం చెల్లదు కదా అంటారా? అయితే, చిలుక వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో కాదు.. పోలీసుల విచారణలో. నిందితులను గుర్తించేందుకు ఆ చిలుకే సాయపడింది. అదెలాగో పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుస్తుంది.
ఆగ్రా(Agra)కు చెందిన విజయ్ శర్మ భార్య నీలమ్ శర్మ 2014 ఫిబ్రవరి 20న ఇంట్లో హత్యకు గురయ్యారు. నిందితులు ఆమెను, వారి పెంపుడు కుక్కను పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేసినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో అనుమానితులుగా కొంతమందిని పోలీసులు విచారించినా.. సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. హత్య జరిగిన తర్వాతి రోజు నుంచి విజయ్ శర్మ పెంపుడు చిలుక సరిగా తినకపోవడం, అతడి మేనకోడలు అషు ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆమెను చూసి అరుస్తుండటం చేసేది. దీంతో హత్య చేసిన వారిని చిలుక చూసి ఉంటుందనే అనుమానంతో విజయ్ శర్మ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ కేసులో గతంలో విచారించిన అనుమానితులతోపాటు అషును కూడా పోలీసులు చిలుక ముందు నిలబెట్టారు. అప్పుడు కూడా చిలుక అషును చూసి అరుస్తుండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. రోన్నీ అనే వ్యక్తితో కలిసి నీలమ్ శర్మను నగలు, డబ్బు కోసం తానే హత్య చేసినట్లు అషు అంగీకరించింది. పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చిలుక వాంగ్మూలం గురించి ప్రస్తావించినప్పటికీ.. దాన్ని మాత్రం సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత చిలుక చనిపోగా, 2020 నవంబరులో విజయ్ శర్మ కరోనాతో మృతి చెందాడని అతడి కుమార్తె నివేదా తెలిపింది. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
భార్య, అత్త, బావమరిదిని కోల్పోయాడు.. చివరి క్షణంలో ఆగడంతో బతికిపోయాడు!
-
India News
సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు.. 3 నెలల క్రితమే హెచ్చరించిన రైల్వే ఉన్నతాధికారి
-
Ap-top-news News
Tirumala: ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు
-
Crime News
Khammam: దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య!.. మంటల్లో కాలిపోతుండగా గుర్తింపు..
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
Ts-top-news News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమినరీకి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత