Crime News: అనకాపల్లి జిల్లాలో విద్యార్థిని హత్య కేసు.. నిందితుడి ఆత్మహత్య

అనకాపల్లి జిల్లాలోని కొప్పుగుండుపాలెంలో విద్యార్థిని హత్య కేసు నిందితుడు సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 11 Jul 2024 09:50 IST

రాంబిల్లి: అనకాపల్లి జిల్లాలోని కొప్పుగుండుపాలెంలో విద్యార్థిని హత్య కేసు నిందితుడు సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ నెల 6న తొమ్మిదో తరగతి విద్యార్థిని దర్శినిని ప్రేమోన్మాది సురేష్‌ గొంతు కోసి చంపాడు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు ఇటీవల రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సురేష్‌ ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి గాలించారు. ఈక్రమంలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం బాగా కుళ్లిపోవడంతో ఎలా ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడంలేదు. శరీరం మీద ఎటువంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని