Acid Attack చికెన్‌లో నాణ్యత లేదంటూ నిర్వాహకులపై యాసిడ్‌ దాడి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధి తిప్పాపూర్‌ గ్రామంలో జరిగిన చికెన్‌ గొడవ

Updated : 01 Apr 2022 12:45 IST

తిప్పాపూర్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధి తిప్పాపూర్‌ గ్రామంలో జరిగిన చికెన్‌ గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. హరీశ్‌ అనే వ్యక్తి చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తుండగా సప్తగిరి కాలనీకి చెందిన చిరు వ్యాపారులు చికెన్‌ కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకున్న తర్వాత చికెన్‌లో నాణ్యత లేదంటూ షాపు వద్దకు వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.

దీంతో ఆగ్రహానికి గురైన చిరు వ్యాపారులు చికెన్‌ షాపు నిర్వాహకుడు హరీశ్‌తో పాటు అడ్డుగా వచ్చిన మరికొందరిపై యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వేములవాడ పట్టణ సీఐ వెంకటేశ్‌ తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని