shraddha walker murder case: శ్రద్ధా వాకర్‌ ఉంగరాన్ని కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన ఆఫ్తాబ్‌..!

శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె ఉంగరాన్ని ఆఫ్తాబ్‌ మరో యువతికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సదరు యువతిని విచారించగా అది నిజమే అని తేలింది. 

Published : 28 Nov 2022 17:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో ఆఫ్తాబ్‌ కప్పిపెట్టిన వాస్తవాలను పోలీసులు తవ్వి తీస్తున్నారు. హత్య చేసిన అనంతరం ఆఫ్తాబ్‌ ఆమె బంగారపు ఉంగరాన్ని తన వద్దే ఉంచుకొన్నాడు. ఆ తర్వాత మరో యువతికి వలవేసి ఇంటికి పిలిపించుకొన్నాడు. ఆ సమయంలో ఆమెకు శ్రద్ధా బంగారపు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇటీవల ఆమెను పోలీసులు విచారణకు పిలిపించి పలు ప్రశ్నలు అడిగారు. ఆఫ్తాబ్‌ ఇంటికి వెళ్లిన సమయంలో అతడో బంగారపు ఉంగరం బహుమతిగా ఇచ్చినట్లు సదరు యువతి పోలీసులకు వెల్లడించింది. పోలీసులు ఆ ఉంగరాన్ని స్వాధీనం చేసుకొని శ్రద్ధా త్రండికి చూపించారు. ఆయన దానిని తన కుమార్తె ఉంగరంగా గుర్తించారు.

శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె తలను శరీరం నుంచి వేరుచేశాడు. అనంతరం ఆమె తలపై జుట్టును తొలగించి ఓ ప్యాకెట్లో ఉంచి ఛత్రపూర్‌ అడవుల్లో పారేశాడు. పోలీసులు ఆ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం.

కట్టుకథలతో ముంబయికి..

శ్రద్ధా హత్య అనంతరం ఆఫ్తాబ్‌ ముంబయి వెళ్లాడు. అక్కడ కొందరు శ్రద్ధా మిత్రులను కూడా కలిశాడు. తనకు ఆమెతో బ్రేకప్‌ అయిందటూ వారికి కట్టుకథలు చెప్పాడు. వారు కూడా ఆఫ్తాబ్‌ను అనుమానించలేదు. మహారాష్ట్రలోని వాసైలో అతడు శ్రద్ధా ఫోన్‌ను వైఫైకు కనెక్ట్‌ చేసి ఆమె మిత్రులతో ఛాటింగ్‌ చేసినట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు. 

గుజరాత్‌లో మాదకద్రవ్యాల సరఫరాదారు అరెస్టు..

గుజరాత్‌లోని సూరత్‌లో మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నాడనే అనుమానంతో ఫైసల్‌ మొమిన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడికి ఆఫ్తాబ్‌ పూనావాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని వాసైలో ఫైసల్‌ ఉండే ప్రదేశంలోనే అఫ్తాబ్‌ కూడా ఉండేవాడు. గుజరాత్‌ పోలీసులు సాధారణ తనిఖీల సమయంలో ఇతడు దొరికాడు. ఇతడితోపాటు ముంబయికి చెందిన అంకిత్‌ షిండే అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని