Mumbai: ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. మామను చంపిన అల్లుడు
భార్య తన ప్రియుడితో పారిపోయిందనే కోపంతో మామయ్యను ఓ అల్లుడు కాల్చి చంపాడు.
ముంబయి: భార్య తన ప్రియుడితో పారిపోయిందనే కోపంతో ఓ భర్త తనకు పిల్లనిచ్చిన మామను కాల్చి చంపాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జల్నా జిల్లాలోని పైఠాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య ఇటీవల ప్రియుడితో కలిసి ఔరంగాబాద్(Aurangabad)కు పారిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు అంబాద్‌లో నివాసముంటున్న ఆమె తండ్రి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇది కాస్త తీవ్రం అవ్వటంతో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో తన మామను కాల్చి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడిక్కడే మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
-
Ts-top-news News
ప్రశ్నపత్రాల లీకేజీలో త్వరలో మూకుమ్మడి అరెస్టులు
-
Ts-top-news News
నిరుటి కంటే ముందే అన్నదాతకు రైతుబంధు!