కుప్పకూలిన మిగ్ -21 ఫైటర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌.. పైలట్‌ కోసం గాలింపు

రాజస్థాన్‌లో మిగ్ - 21 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. జైసల్మేర్‌లో...

Updated : 18 Aug 2022 15:23 IST

జయపుర: భారత వైమానిక దళానికి చెందిన మిగ్ - 21 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కుప్పకూలింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ పైలట్‌ కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శామ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డీసెర్ట్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో కూలినట్లు జైసల్మేర్‌ జిల్లా ఎస్పీ అజయ్‌ సింగ్ పేర్కొన్నారు. వెంటనే పోలీసు సిబ్బందిని సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించామని, తాను కూడా అక్కడకు వెళ్తున్నట్లు ఎస్పీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే వైమానికి దళానికి చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్ సహా 14 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని