Noida: అజయ్‌ దేవగన్‌ స్టైల్లో కారు స్టంట్‌.. యువకుడు కటకటాలపాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన ఓ యువకుడు బాలీవుడ్ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ స్టైల్లో కారు స్టంట్‌ చేసి కటకటాలపాలయ్యాడు......

Published : 23 May 2022 01:44 IST

నొయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన ఓ యువకుడు బాలీవుడ్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ స్టైల్లో కారు స్టంట్‌ చేసి కటకటాలపాలయ్యాడు. పోలీసులు రెండు ఎస్‌యూవీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. అజయ్‌  ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ సినిమాలో రెండు బైకులపై, గోల్‌మాల్‌-3లో  రెండు కార్లపై నిల్చొని ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్‌ అనే యువకుడు (21) సైతం అదే తరహా స్టంట్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అతగాడు చేసిన స్టంట్లలో ఏమాత్రం బ్యాలెన్స్‌ తప్పినా.. కిందపడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ స్టంట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో అప్రమత్తమైన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

రాజీవ్‌పై న్యూసెన్స్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నొయిడా ఎస్‌ఎహ్‌ఓ శరద్‌ కాంత్‌ వెల్లడించారు. స్టంట్‌లకు వినియోగించిన రెండు ఎస్‌యూవీ కార్లను, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని