అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను సికింద్రాబాద్‌ కోర్టు తిరస్కరించింది. ఆమెపై అదనపు సెక్షన్లు నమోదుచేసినట్లు...

Published : 18 Jan 2021 15:23 IST

హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను సికింద్రాబాద్‌ కోర్టు తిరస్కరించింది. ఆమెపై అదనపు సెక్షన్లు నమోదుచేసినట్లు పోలీసులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.

ఈ కేసులో అఖిలప్రియ సహా ఇప్పటివరకు 19 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సికింద్రాబాద్‌ న్యాయస్థానం స్పందిస్తూ అదనపు సెక్షన్లు దాఖలు చేసినందున తాము బెయిల్‌ ఇవ్వలేమని పై కోర్టుకు వెళ్లాలని అఖిలప్రియ తరఫు న్యాయవాదికి సూచించింది. దీంతో వారు నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశముంది.

ఇవీ చదవండి..

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో దారుణం

బైక్‌ అంబులెన్స్‌ రూపొందించిన డీఆర్డీవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని