Khammam: అశ్వారావుపేట పోలీసులను వెంటాడుతున్న విషాదాలు.. గుండెపోటుతో మరో ఎస్సై మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్‌లో పోలీసులను విషాదాలు వెంటాడుతున్నాయి.

Updated : 10 Jul 2024 10:06 IST

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్‌లో పోలీసులను విషాదాలు వెంటాడుతున్నాయి. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే.. దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మంలో బుధవారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎస్సై మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనతో అశ్వారావుపేట సర్కిల్ పరిధిలోని పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు