Crime News: యువతికి అసభ్య చిత్రాలు.. లోన్‌ యాప్‌ ప్రతినిధి అరెస్టు

ఓ యువతికి అసభ్య చిత్రాలు పంపించి వేధించిన లోన్‌ యాప్‌ ప్రతినిధిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన

Published : 29 May 2022 01:46 IST

హైదరాబాద్‌: ఓ యువతికి అసభ్య చిత్రాలు పంపించి వేధించిన లోన్‌ యాప్‌ ప్రతినిధిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన యువతి లోన్‌ యాప్‌లో రుణం తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోయింది. దీంతో యువతి చరవాణికి అసభ్య సందేశాలతో పాటు.. ఆమె ఫొటోను మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలు వచ్చాయి. బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిందితుడిని బిహార్‌లో సివాన్‌ జిల్లా గోపాల్‌పూర్‌ కోఠిలో ఉన్నట్టు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. మనీష్‌ కుమార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వికాస్‌ కుమార్‌ అనే లోన్‌ యాప్‌ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. వాయిదాలు సకాలంలో చెల్లించని వారి ఆధార్‌, పాన్‌ కార్డు, ఫొటోను వికాస్‌కు.. మనీష్‌ పంపిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అసభ్య చిత్రాలను రుణగ్రహీత ఫోన్‌లో ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లను ఎంపిక చేసుకొని వారి మొబైల్‌ ఫోన్లకు మనీష్‌ పంపిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వికాస్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని