Apsara Murder Case: తలకు బలమైన గాయాలవల్లే అప్సర చనిపోయింది: పోస్టుమార్టం నివేదిక

పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తోందని ప్రియురాలు అప్సరను అతికిరాతకంగా హతమార్చిన ఘటన నగరంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది...

Updated : 10 Jun 2023 13:48 IST

హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తోందని ప్రియురాలు అప్సరను అతికిరాతకంగా హతమార్చిన ఘటన నగరంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య బృందం పోస్టుమార్టం చేశారు. ప్రాథమిక నివేదికను వైద్యులు పోలీసులకు అందించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు వైద్యులు తెలిపారు. అనంతరం అప్సర మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. సరూర్‌నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్‌ పోలీసులు సాయికృష్ణను జడ్జి ఎదుట హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. 

ఆ రోజు ఏం జరిగిందంటే..👇

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని